
సాక్షి, మహబూబ్‌నగర్: వెనకబడిన పాలమూరు జిల్లాను తెలంగాణ అగ్రగామి జిల్లాగా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో సోమవారం పర్యటించిన మంత్రి ఈ సందర్భంగా జిల్లాలో ఎక్స్‌పో ప్లాజాను ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందని వ్యాఖ్యానించారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి బాటలో నిలుపుతామన్నారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోన్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని నిరాటంకంగా చేస్తున్నామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని ఉమ్మడి జిల్లాలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీరంధిస్తామన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోవాల్సిన పని లేదని మంత్రి పేర్కొన్నారు.
చదవండి: మహానగరం ఇక విశ్వనగరం: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment