
ఎంపీ పదవికి కడియం రాజీనామా ఆమోదం
న్యూఢిల్లీ: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పార్లమెంట్ సభ్యత్వానికి చేసిన రాజీనామాను ఆమోదించారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో ఈ విషయాన్ని ప్రకటించారు. మంగళవారం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
లోక్సభ ప్ర్రారంభంకాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. కడియం రాజీనామాను ఆమోదించినట్టు ప్రకటించారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడియం శ్రీహరి వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. కడియంను తన కేబినెట్లోకి తీసుకుని ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. దీంతో కడియం లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు.