రైల్వే జీఎంకు ఎంపీలు కడియం, సీతారాంల వినతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కీలకమైన కాజీపేట రైల్వే జంక్షన్‌ను ప్రత్యేక డివిజన్‌గా మార్చాలని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్ కోరారు. తాము రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఈ అంశంపై దక్షిణ మధ్య రైల్వే వెంటనే ప్రతిపాదన పంపాలని వారు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవను కోరారు.
మంగళవారం సాయంత్రం జీఎంతో సమావేశమై, కాజీపేటపై పలు అంశాలను చర్చించారు. ఇప్పటికే మంజూరైన రైలు వ్యాగన్ల తయారీ యూనిట్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలనగా, అనువైన స్థలాన్ని జిల్లా కలెక్టర్ అప్పగించలేదని, అప్పగింత ప్రక్రియ సత్వరం పూర్తి చేయించాలని ఎంపీలను జీఎం కోరారు. కాజీపేట జంక్షన్‌లో అదనంగా ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయాలని. కొన్ని కొత్త రైళ్లు ప్రారంభించాలని, మరిన్ని రైళ్లను కాజీపేటలో నిలిపే సదుపాయం కావాలని ఎంపీలు కోరగా, అందుకు ప్రతిపాదనలు పంపాలని జీఎమ్ సూచించారు.
భద్రతకు, సమయపాలనకు ప్రాధాన్యం: జీఎం
భద్రత, సమయపాలనకు ప్రాధాన్యమివ్వాలని శ్రీవాత్సవ ఉన్నతాధికారులను ఆదేశించారు. రైల్వే డివీఎంలు, ఇతర ముఖ్య విభాగాల అధిపతులతో ఆయన మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. రైల్వేస్టేషన్ల పరిశుభ్రత వారోత్సవాల తీరుపై వాకబు చేశారు. ప్రయాణికులు చెత్త వేయకుండా నివారించాలన్నారు. ఉన్న నిధులను పరిగణనలోకి తీసుకుకుని ప్రాధాన్యతాక్రమంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
కాజీపేటను డివిజన్‌గా మార్చండి
Published Wed, Jun 18 2014 2:50 AM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM
Advertisement