సాక్షి, నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక పథకం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లాలోని ఉరుమడ్లలో మంగళవారం అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య , కంచర్ల భూపాల్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, నల్లగొండ ,యాదాద్రి జడ్పీ చైర్మన్లు బండ నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఉరుమడ్ల గ్రామ అభివృద్ధి కోసం 30 రోజుల గ్రామ ప్రణాళిక పథకానికి టీఆర్‌ఎస్ నేత కంచర్ల కృష్ణారెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు కోటి రూపాయల చెక్కును మంత్రుల సమక్షంలో గ్రామ పంచాయతీకి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment