సాక్షి, హైదరాబాద్/ఒంగోలు: బిహార్ మాజీ ముఖ్యమంత్రి 'జననాయక్' కర్పూరి ఠాకూర్ 95వ జయంతి సందర్భంగా తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక ఘన నివాళులు అర్పించింది. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ నివాళి అర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కర్పూరి ఠాకూర్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఎంబీసీల గౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. 'జననాయక్' స్ఫూర్తితో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. నాయీ బ్రాహ్మణ నాయకులు రమేశ్, జి. శ్రీనివాస్ తదితరులు కూడా కర్పూరి ఠాకూర్‌కు నివాళులు అర్పించారు.
పరిపాలనాదక్షుడు కర్పూరి ఠాకూర్
రాజకీయాల్లో విలువలకు నిలువుటద్దంగా నిలిచిన పరిపాలనాదక్షుడు కర్పూరి ఠాకూర్ అని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక పేర్కొంది. ఒంగోలులోని బీసీ కులాల ఆరామ క్షేత్రాల సముదాయంలో కర్పూరి ఠాకూర్ 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాధారణ మంగలి కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన కర్పూరి ఠాకూర్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడ్డారని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు పిల్లుట్ల సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, మిరియాల రాఘవ, ఏల్చూరి రమేశ్, బత్తుల కృష్ణమూర్తి, కొణిజేటి రామకృష్ణ, ఏల్చూరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment