
ఆ త్యాగాలను స్మరించుకుంటే ఇప్పటికీ కన్నీళ్లే: కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నవారి త్యాగాలను స్మరించుకుంటే ఇప్పటికీ తనకు కన్నీళ్లు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీలో తెలంగాణ అమరవీరుల సంతాప తీర్మానాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ను స్మరించుకున్నారు. జయశంకర్ సార్ మహోన్నత వ్యక్తి అని కేసీఆర్ అన్నారు. విద్యార్థి దశలోనే జయశంకర్ ఉద్యమాన్ని మొదలుపెట్టారన్నారు. ఆయన ఈనాడు లేకపోవడం తీరని లోటు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమరవీరుల త్యాగం వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్నారు. శ్రీకాంతాచారితో మొదలై దాదాపు 1500 మంది ప్రత్యేక తెలంగాణ కోసం బలిదానాలు చేశారన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పోలీసుల తూటాలకు 369మంది మరణిస్తే మలిదశ ఉద్యమంలో 1200మంది ప్రాణత్యాగం చేసుకున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.
కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అసెంబ్లీ, అమరవీరులు, సంతాపం, kcr, prof.jayashankar, telangana assembly, condolence,