{పజల కోసం అందరూ ఏకమై పోరాడాలి
టీపీఎఫ్ జిల్లా మహాసభల్లో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి
హన్మకొండ చౌరస్తా : రాష్ట్రంలో మేధావులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు కో సం పాకులాడుతున్నారని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఎద్దువా చేశారు. తె లంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్) జిల్లా రెం డో మహాసభలు శనివారం హన్మకొండ బాలసముద్రంలోని మీనాక్షి ఫంక్షన్‌హాల్ లో జరిగాయి. టీపీఎఫ్ జిల్లా అధ్యక్షురా లు బి.రమాదేవి అధ్యక్షతన జరిగిన ఈ స భలో యాదగిరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
కాసుల కోసమే పథకాలు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాసుల కక్కుర్తి కోసం పథకాల రూపకల్పనలోనే కొనసాగుతుందని పాశం యాదగిరి విమర్శించారు. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు భరోసా ఇవ్వకుండా ఆందోళన లు చేస్తున్న వారిపై పోలీసులతో అణచివేస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలు, వనరుల సంరక్షణ కోసం టీపీఎఫ్ అన్ని సం ఘాలను ఐక్యం చేసి ప్రత్యామ్నయ వేది కగా నిలిచి పోరాడాలని సూచించారు. టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్ర భాకర్ మాట్లాడుతూ కాంట్రాక్టుల ద్వారా వచ్చే సొమ్ము కోసమే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేస్తున్నారని అన్నారు. వరంగల్‌కు పెద్ద దిక్కైనా బిల్ట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిం చాలని డిమాండ్ చేశారు. టీపీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ మాట్లాడుతు కేసీఆర్ ప్రభుత్వం గత పాల కుల మాదిరిగానే అప్రజాస్వామిక విధానాలను కొనసాగిస్తున్నారని అన్నారు. సీఎల్‌సీ ప్రధాన కార్యదర్శి నారాయణరావు మా ట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్‌కౌం టర్లు ఉండవన్న కేసీఆర్ ప్రస్తుతం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. ఈ సభలో సీఎంసీ ప్రధాన కా ర్యదర్శి దేవేంద్ర, తుడుందెబ్బ రాష్ట్ర అద్యక్షుడు వట్టం ఉపేందర్, టీఏకేఎస్ రాష్ట్ర అద్యక్షుడు బంటు శ్రీను, అమరుల బంధుమిత్రుల సంఘం నుంచి పద్మకుమారి, టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్, పౌర హ క్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా రాయణ, తెలంగాణ రైతు సమితి జిల్లా అ ధ్యక్షుడు కె.ఐలయ్య పాల్గొన్నారు.