
అసలు హంతకుడు కేసీఆరే: పొన్నాల
మహబూబ్నగర్: కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయి తెలంగాణలో 322 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నదాతల ఆత్మహత్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు.
అసలు హంతకుడు కేసీఆరే అంటూ పొన్నాల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు కరెంట్ ఇవ్వడం లేదన్న కేసీఆర్... ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని పొన్నాల ప్రశ్నించారు.