
నారాయణపేట : పెద్ద నర్సప్ప మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
నారాయణపేట: వరి నారుకు నీరు పెట్టే క్రమంలో బోరు మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని గనిమోనిబొండలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బొడ్డోపోళ్ల పెద్దనర్సప్ప(55) శనివారం తన పొలంలో వరి నారు పెట్టేందుకు బోరును ప్రారంభించేందుకు వెళ్లారు. కాగా పొలంలో అతి తక్కువ ఎత్తులో కట్టెకు విద్యుత్ వైర్లను అమర్చారు. అయితే కట్టె విరిగిపోవడంతో దానిని పైకి లేపేందుకు ప్రయత్నించగా అంతలోనే వైరు తెగి ఆయనపై పడటంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
పక్క పొలాల్లో ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని పోలీస్‌స్టేషన్‌కు స మాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమో దు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెద్ద నర్సప్ప కు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment