
'కేంద్ర ఫలాలందకుండా కేసీఆర్ అడ్డు'
మహబూబ్‌నగర్: కేంద్రం పెట్రోల్, డీజల్ ధరలను కేంద్రం తగ్గిస్తుంటే.. ఆ ఫలాలు ప్రజలకు అందకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. వ్యాట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దొంగ దెబ్బ తీస్తోందని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా శుక్రవారం కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నా.. పనులు మాత్రం సచివాలయం గేటు కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా లక్ష ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన కేసీఆర్.. తీరా ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకుండా రిపోర్టులు, నివేదికలు అంటూ కాలయాపన చేస్తున్నారని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు కరువు బారిన పడకుండా చర్యలూ చేపట్టడం లేదని విమర్శించారు.