'కేసీఆర్ ఇప్పటికైనా మైండ్ గేమ్ మానుకో' | KCR playing mind game, says kichannagari lakshma reddy | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఇప్పటికైనా మైండ్ గేమ్ మానుకో'

Published Thu, Mar 20 2014 3:03 PM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM

KCR playing mind game, says kichannagari lakshma reddy

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మేడ్చల్  కాంగ్రెస్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీధర్ మండిపడ్డారు. ఆపార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థుల కొరత ఉండటంతో ఇతర పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారని వారు అన్నారు. తెలంగాణ వ్యతిరేకులను కూడా పార్టీలో చేర్చుకునేందుకు కూడా కేసీఆర్ వెనుకాడటం లేదని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ నేతలు కొందరు టీఆర్ఎస్లో చేరుతున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా మైండ్ గేమ్ మానుకోవాలని కేఎల్ఆర్ హెచ్చరించారు. తమకు పార్టీ వీడే ఆలోచన లేదని వారిద్దరు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement