కేసీఆర్‌ది ద్వంద వైఖరి | KCR showing dual attitude in Dharna chowk | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది ద్వంద వైఖరి

Apr 24 2017 5:38 PM | Updated on Jul 29 2019 7:38 PM

ధర్నాచౌక్ విషయంలో కేసీఆర్ ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిథి నగేష్‌ ముదిరాజ్‌ మండిపడ్డారు.

హైదరాబాద్‌: ధర్నాచౌక్ విషయంలో కేసీఆర్ ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిథి నగేష్‌ ముదిరాజ్‌ మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ.. నియంతృత్వ ధోరణితో కేసీఆర్ ధర్నా చౌక్‌ను తరలిస్తున్నారని, అసెంబ్లీ సాక్షిగా ధర్నా చౌక్ ఎత్తి వేయలేదు అన్న కేసీఆర్ ఎందుకు పోలీసులకు లిఖిత పూర్వకంగా తెలియ చేయలేదని ప్రశ్నించారు.

ధర్నా చౌక్ పై కోర్ట్‌ను ఆశ్రయించామని, కోర్ట్ తీర్పు న్యాయంగా వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని దేశానికి తెలియచేసింది ధర్నా చౌక్ అని గుర్తు చేశారు. నగర  శివారులోని అడవి ప్రాంత లో ధర్నా చౌక్ ని కేటాయించారు..ఇది సమంజసమా అని ప్రశ్నించారు. ధర్నాచౌక్‌ అసెంబ్లీ లాంటిదని..దాన్ని  ఇందిరా పార్క్ వద్దే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement