
ధర్నాచౌక్ అసెంబ్లీ లాంటిది: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ఉందని, ధర్నా చౌక్‌ను తరలించడం ద్వారా టీఆర్‌ఎస్ నియంతృత్వ ధోరణిని బయటపెట్టుకుందని టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ ముదిరాజ్ విమర్శించారు.
సామాన్య ప్రజలకు ధర్నా చౌక్ అసెంబ్లీ లాంటిదని, దానిని ఇందిరా పార్కు వద్దే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ధర్నాచౌక్‌ను ఎత్తివేయలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్ వాస్తవ పరిస్థితులను దాచిపెడుతున్నారని ఆరోపించారు. నిరసన తెలిపేందుకు పోలీసులు ఎందుకు అనుమతిని ఇవ్వడంలేదో చెప్పాలన్నారు.