సాక్షి, హైదరాబాద్: బస్సుల ఆక్యుపెన్సీ రేషియో (ఓ ఆర్)ను 80 శాతానికి పెంచేందుకు కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో డిపోలకు వెళ్లి అక్కడి ఉద్యోగులకు సంస్థపై నమ్మకం కలిగేలా చూడాలన్నారు. రాష్ట్ర రవాణా సంస్థ పురోగతి, ఉద్యోగుల సంక్షేమంపై శనివారం సంస్థ ఎండీ సునీల్ శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రయాణికులు చేయెత్తిన చోట ఆపడం, అడిగిన చోట దింప డం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment