కేసీఆర్.. దోమ కథ! | kcr tells mosquito story in haritha haram meeting | Sakshi
Sakshi News home page

కేసీఆర్.. దోమ కథ!

Published Fri, Jul 3 2015 4:41 PM | Last Updated on Sat, Aug 11 2018 7:06 PM

కేసీఆర్.. దోమ కథ! - Sakshi

కేసీఆర్.. దోమ కథ!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దోమ కథ చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ హరితహారం ప్రారంభోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ఆయన ప్రసంగించారు. దోమ గురించి, ముఖ్యమంత్రి గురించి ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం...

''చెత్త ఎక్కడుంటే అక్కడే దోమ ఉంటది. దోమ ఎవరినైనా కుడతది. ఎమ్మెల్యేని, మంత్రిని, ముఖ్యమంత్రినైనా కుడతది. దానికి అడ్డం లేదు. అది సోషలిస్టు దోమ. తన ఎదురుగా వచ్చేది మంత్రా కాదా.. ఊరి సర్పంచా కాదా.. కుట్టచ్చా కుట్టకూడదా అని చూసి ఆగదు. కుట్టిందంటే ఏ మలేరియానో, చలిజ్వరమో వస్తది.. పోయి దవాఖానలో పడతరు'' అన్నారు.

అయితే సీఎం కేసీఆర్ ఏ దోమను ఉద్దేశించి అన్నారో, ఎవరిని కుడుతుందన్నారో, కుడితే ఏమవుతుందని అన్నారన్నది మాత్రం.. పాఠకుల ఊహకే వదిలేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement