కేసీఆర్ కృషి ఫలితమే రైతులకు ఉపశమనం | KCR to Save the Farmers from Notes Ban | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కృషి ఫలితమే రైతులకు ఉపశమనం

Published Fri, Nov 25 2016 3:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

కేసీఆర్ కృషి ఫలితమే రైతులకు ఉపశమనం - Sakshi

కేసీఆర్ కృషి ఫలితమే రైతులకు ఉపశమనం

 ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాల్ 
 సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సీఎం కేసీఆర్ విజ్ఞప్తికి ప్రధానమంత్రి మోదీ సానుకూలంగా స్పందించారని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాల్‌చారి చెప్పారు. బుధవారం ఆయన మీడియా పాయి ంట్ మాట్లా డుతూ నోట్ల రద్దు వల్ల రైతులు, సామాన్య ప్రజలు, మహిళా సమాఖ్య, పౌల్ట్రీ రంగం పడుతున్న ఇబ్బందులను సీఎం ప్రధానికి వివరించారన్నారు. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పదించి రైతుల ఉపశమనానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని కలసి రాష్ట్ర రోడ్ల సమస్యలపై విన్నవించటంతో సానుకూల స్పందన వచ్చిందన్నారు. రాష్ట్రానికి 705 కిలోమీటర్ల నేషనల్ హైవే ఆథారిటీకి కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement