చివరి నిమిషంలో కేసీఆర్ ఆదిలాబాద్ పర్యటన రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చివరి నిమిషంలో రేపటి ఆదిలాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ లో వైభవంగా జరుగుతున్న నాగోబా జాతరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెళ్లడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలిజాతరకు సీఎం కేసీఆర్ రావడంపై సంతోషం వ్యక్తం చేసిన గిరిజనులు సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ పర్యటన రద్దు చేసుకోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నారు.
నాగోబా జాతరకు గిరిజన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు హాజరవుతారా? లేదా అన్నదానిపై కూడా సందేహాలున్నాయి. ఈ ఇద్దరు మంత్రుల పర్యటన వివరాలు ఇంకా వెల్లడించలేదు.
అయితే, జాతరకు కేసీఆర్ హెలీకాఫ్టర్లో రానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని, ఏర్పాట్లను సీఎం సెక్యూరిటీ అధికారులు బుధవారం పరిశీలించారు. ఈ నెల 27 వరకు నాగోబా జాతర కొనసాగుతుంది.