
సాక్షి,హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాçపూఘాట్ ప్రార్థనా మందిరంలోని గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తొలుత మంగళవారం ఉదయమే సీఎం కేసీఆర్ బాపూ ఘాట్‌కు చేరుకుని అక్కడికి వచ్చిన గవర్నర్ నరసింహన్‌కు స్వాగతం పలికారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసాని, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీఎస్ ఎస్.కె.జోషి, ఇంటెలిజెన్స్ ఐజీ ఎం.కె.సింగ్‌పాల్గొన్నారు.
అసెంబ్లీలో శ్రీలంక పార్లమెంట్ బృందం
స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, స్వామిగౌడ్, నేతి విద్యాసాగర్‌లతో పాటుగా నగర పర్యటనకు వచ్చిన శ్రీలంక పార్లమెంట్ అధికారుల బృందం సభ్యులు అసెంబ్లీలోని మహాత్ముని విగ్రహానికి నివాళులర్పించారు.