birth anniversary of Mahatma Gandhi
-
సత్యాగ్రహ ఆశ్రమాన్ని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలి
సాక్షి, ఢిల్లీ: నెల్లూరులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని గాంధీ హెరిటేజ్ సైట్స్ మిషన్‌లో చేర్చాలని రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. మహాత్మా గాంధీ 1921లో నెలకొల్పిన ఈ ఆశ్రమాన్ని దక్షిణ సబర్మతి ఆశ్రమంగా పిలుస్తుంటారని, ఇక్కడి నుంచే అనేక ఉద్యమాలకు బీజం పడిందని ఆయన గుర్తు చేశారు. ఆశ్రమంలోని డిజిటల్ మ్యూజియం సరైన పరికరాలు లేక పని చేయడం లేదన్నారు. పరికరాల కోసం 2.8 కోట్లు, ఏటా ఖర్చుల కోసం 14 లక్షల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 150వ మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయడం, సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని విన్నవించారు. -
జాతిపితకు గవర్నర్, సీఎం నివాళులు
సాక్షి,హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాçపూఘాట్ ప్రార్థనా మందిరంలోని గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తొలుత మంగళవారం ఉదయమే సీఎం కేసీఆర్ బాపూ ఘాట్‌కు చేరుకుని అక్కడికి వచ్చిన గవర్నర్ నరసింహన్‌కు స్వాగతం పలికారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసాని, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీఎస్ ఎస్.కె.జోషి, ఇంటెలిజెన్స్ ఐజీ ఎం.కె.సింగ్‌పాల్గొన్నారు. అసెంబ్లీలో శ్రీలంక పార్లమెంట్ బృందం స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, స్వామిగౌడ్, నేతి విద్యాసాగర్‌లతో పాటుగా నగర పర్యటనకు వచ్చిన శ్రీలంక పార్లమెంట్ అధికారుల బృందం సభ్యులు అసెంబ్లీలోని మహాత్ముని విగ్రహానికి నివాళులర్పించారు. -
భరత జాతి గుండెచప్పుడు
సత్యం, అహింస ఆయుధాలుగా దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహాత్ముడిని దేశం మొత్తం స్మరించుకుంటోంది. నాజీవితమే నా సందేశం అంటూ ఎలుగెత్తి చాటిన ఆ మహనీయుడు స్మృతుల్లో సకల భారతావని తేలిపోతోంది. తరతరాలకు ఆదర్శప్రాయుడైన గాంధీని అనుసరిద్దాం అంటూ ఎలుగెత్తి చాటుతోంది. ....... భరతమాత స్వేచ్ఛ కోసం జీవితాంతం తపన పడిన ఆ గుండె చప్పుడుని ఇప్పుడు మనమూ వినొచ్చు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని నేషనల్ గాంధీ మ్యూజియంలో ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. అందులో గాంధీ గుండె చప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గాంధీజీ జీవితంలో వివిధ దశల్లో తీసిన ఈసీజీలను సేకరించి వాటికి అనుగుణంగా డిజిటల్ పద్ధతుత్లో గుండె చప్పుడుని కృత్రిమంగా సృష్టించారు. ఈ గుండె చప్పుడు సందర్శకుల్ని విపరీతంగా ఆకర్షిస్తుందని మ్యూజియం డైరెక్టర్ ఎ. అన్నామలై తెలిపారు. అహింసా, ప్రపంచ శాంతి అన్న థీమ్‌తో ఒక ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అంతే కాదు మహాత్ముడికి చెందిన అరుదైన సేకరణలతో డిజిటల్ మల్టీమీడియా కిట్‌ను రూపొందించారు. ఒక పెన్ డ్రైవ్‌లో ఉండే ఈ కిట్‌లో గాంధీజీ రచించిన 20 పుస్తకాలు, మహాత్ముడిపై వచ్చిన 10 పుస్తకాలు, గాంధీజీపై ఎకే చెట్టియార్ తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్, మహాత్ముని జీవిత విశేషాల్ని తెలిపే 100 అరుదైన చిత్రాలు, గాంధీజీ ప్రసంగాలు, గాంధీజీ ఆశ్రమంలో టూర్, ఆయనకు ఇష్టమైన భజనలు ఆ కిట్‌లో ఉంటాయి. ఈ కిట్‌ను రూ.300లకు సందర్శకులు కొనుక్కోవచ్చు. నెదర్లాండ్స్‌లో గాంధీ మార్చ్ అక్టోబర్ 2, గాంధీ మహాత్ముడి జయంతే కాదు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం కూడా. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు సంబరాలు చేసుకున్నాయి. ఈ సారి మహాత్ముడి 150వ జయంతి కావడంతో నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో వెయ్యి మందితో గాంధీ మార్చ్ జరిగింది. ఇందులో వివి«ధ దేశాలకు చెందిన 20 మంది రాయబారులు కూడా పాల్గొన్నారు. వీరంతా మహాత్ముడిని అనుసరిద్దాం అన్న లోగో ప్రింట్ చేసిన టీ షర్ట్లు ధరించారు. నెదర్లాండ్స్‌లో భారత రాయబారి రాజమణి ఈ మార్చ్‌కు నేతృత్వం వహించారు. మార్పు కోసం 150 ఆలోచనలు బాపూజీ ఆదర్శాలే స్ఫూర్తిగా సమాజంలో మార్పు కోసం 150 ఐడియాలు ఇవ్వండి అంటూ లెటర్‌ఫారమ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. సమాజంలో మార్పుకోసం తమకు వచ్చిన ఆలోచనల్ని పోస్టుకార్డుపై రాసి పంపండి అంటూ ఆ స్వచ్ఛంద సంస్థ యువతకి పిలుపునిచ్చింది. వచ్చే ఏడాదిలోగా యువత నుంచి వచ్చిన వాటిలో అత్యుత్తమమైన 150 ఆలోచనల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకొని దేశాభివృద్ధి కోసం ఏం చేయవచ్చో సమగ్ర చర్చ జరుపుతామని లెటర్‌ఫారమ్స్ స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకుడు సాటి మాథ్యూ వెల్లడించారు. యువత తమకు వచ్చిన ఆలోచనని ఛేంజ్150, లెటర్‌ఫారమ్స్, పోస్టుబ్యాగ్నెం.1683, కొచ్చి, కేరళ అన్న చిరునామాకు పంపించవచ్చు. ముంబైలో కళాకారుల ప్రదర్శన దక్షిణ ముంబైలోని ప్రతిష్టాత్మక సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ (ఎస్జేజేఎస్ఏ) మహాత్ముడి కోసం ప్రత్యేకంగా కళాకారుల ప్రదర్శన ఏర్పాటుచేసింది. మహారాష్ట్రవ్యాప్తంగా 150 మంది కళాకారులు వివిధ కళారూపాల్లో గాంధీజీకి నివాళులర్పించనున్నారు. చిత్రకారులు, శిల్పకళాకారులు, చేనేత కళాకారులు రకరకాల ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని రంజింపజేయనున్నారు. డ ఒడిశాలో రెండేళ్లపాటు ఉత్సవాలు ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గాంధీజీ 150 జయంతి ఉత్సవాలను రెండేళ్లపాటు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ గాంధీజీ సిద్ధాంతాలు తెలిసేలా, గాంధీని అనుసరించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు 2020 అక్టోబర్ 2వరకు కొనసాగనున్నాయి. ట్విట్టర్లో గాంధీజీ ఇమోజీ మహాత్మా గాంధీ 150 జయంతిని సందర్భంగా ట్విట్టర్ మంగళవారం గాంధీజీ ఇమోజీని ఆవిష్కరించనుంది. ఈ ఇమోజీ వారం రోజుల పాటు నెటిజన్లకు అందుబాటులో ఉంటుంది. గాంధీ జయంతి సందర్భంగా ఎవరైనా ట్వీట్లు చేస్తే గాంధీ జయంతి హ్యాష్‌ట్యాగ్‌లతో పాటుగా గాంధీ ఇమోజీని కూడా వినియోగించవచ్చు. దీంతో పాటుగా మహాత్ముడి క్యారికేచర్ కూడా నీలం తెలుపు రంగుల్లో ట్విట్టర్ బ్యాక్ డ్రాప్లో మెరిసిపోనుంది. ట్విట్టర్ అధికారిక లోగో థీమ్‌లో భాగంగా ఈ కేరికేచర్ దర్శనమివ్వబోతోంది. గాంధీజీ స్కూలు.. ఇక ‘చరిత్ర’నేనా..! జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల కోసం దేశవ్యాప్తంగా అట్టహాసంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అప్రియ సందర్భం కూడా వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లో గాంధీజీ స్థాపించిన ‘రాష్ట్రీయ శాల’ స్కూలు నిర్వహణ కుæ నిధులు కొరవడడంతో రెండు నెలల క్రితం మూతపడింది. 97 ఏళ్ల నాటి ఈ పాఠశాలలో 1–7 తరగతుల మధ్య చదువుకుంటున్న 37 మంది విద్యార్థులు ఇప్పుడు మరో స్కూళ్లో చేరాల్సి వచ్చింది. ప్రపంచస్థాయి మ్యూజియంగా మార్చిన ఆల్ఫ్రేడ్ హైస్కూల్‌ను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మ్యూజియంకు కేవలం 2 కి.మీ దూరంలోనే ఈ పాఠశాల ఉనికి కోల్పోయింది. 1921 ఫిబ్రవరి 1న ప్రారంభించిన ఈ స్కూల్ నియామవళిని గాంధీజీనే రూపొందించారు. జాతి నిర్మాణానికి సంబంధించి ఆదర్శాలను పిల్లల్లో ప్రోదిగొల్పేలా చేయాలన్నదే వీటి లక్ష్యం. ఈ పాఠశాలలోనే గాంధీజీ తరచుగా ప్రార్థన చేయడంతో పాటు , స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా 1939లో ఇక్కడే నిరాహారదీక్ష కూడా చేశారు. ఈ నగరంలోనే ఓ ఉత్తమ పాఠశాలగా ఇది విరాజిల్లింది. ప్రస్తుత గుజరాత్ విద్యాపీ uŠ‡ వైస్‌ఛాన్సలర్ అనామిక్ షా తో సహా పలువురు ప్రముఖుడు ఇక్కడే చదువుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగొచ్చాక గాంధీజీ అప్పుడున్న విద్యావిధానాన్ని తక్షణం మార్చాల్సిన అవసరాన్ని గుర్తించారు. దీనిద్వారానే ప్రజలను స్వాతంత్ర ఉద్యమానికి సిద్ధం చేయగలమనే అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనలకు ప్రతిరూపంగానే ‘రాష్ట్రీయ శాల’ రూపుదిద్దుకుంది. యువతకు మాతృభాషలోనే విద్యాబోధన అందాలని. ఆ విధంగా విద్యను అందించగలిగితే దేశంతో పాటు కష్టాల్లో ఉన్నవారికి సేవ చేసేందుకు అవకాశం కలుగుతుందని ఆయన నమ్మారు. ఈ స్కూలును నడుపుతున్న రాష్ట్రీయ శాలట్రస్ట్ నిధుల కోసం బుక్లెట్ల ద్వారా ప్రజలకు విజ్ఞప్తిచేసింది. ఈ చారిత్రక విద్యాసంస్థ పరిరక్షణ కోసం విరాళాలివ్వాల్సిందిగా ప్రజలు, కార్పొరేట్ల సహాయం కూడా కోరింది. అయితే స్కూల్‌ను నడిపేందుకు ఏడాదికి రూ.8.3 లక్షలు కావాలని, ఆ మేర నిధులు లేకపోవడంతో గత్యంతరం లేక దీనిని మూసేస్తున్నట్టు మేనేజింగ్ ట్రస్టీ, పాఠశాల ప్రధాన కార్యదర్శి జీతూ భట్ తెలిపారు. టాల్‌స్టాయ్ మెచ్చిన గాంధీ రష్యా ప్రఖ్యాత నవలాకారుడు లియో టాల్‌స్టాయ్ తన జీవిత చరమాంకంలో ఆఖరి ఉత్తరాన్ని ఎవరికి రాశారో తెలుసా? మన గాంధీజీయే. తనకంటే వయసులో 40 ఏళ్లు చిన్న అయినప్పటికీ తమ్ముడూ, మిత్రమా అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూ తన ఆలోచనల్ని పంచుకున్నారు. 1910లో తన 82 ఏళ్ల వయసులో మరణించడానికి సరిగ్గా రెండు నెలల ముందు టాల్‌స్టాయ్ గాంధీజీకి రాసిన లేఖ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. దక్షిణాఫ్రికాలోనూ, భారత్‌లోనూ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసింది. ‘నేను సంపూర్ణ జీవితాన్ని అనుభవించాను. మరణం నా వెనుకే పొంచి ఉందని నాకు తెలుస్తోంది. అందుకే నేను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెబుతున్నాను. దుర్మార్గుల్ని నిరోధించాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రపంచంలో మిమ్మల్నెవరూ బానిసలుగా మార్చలేరు‘ అంటూ ఆ లేఖలో రాశారు. అహింసా మార్గంలో గాంధీజీ చేస్తున్న పోరాటాన్ని కూడా టాల్‌స్టాయ్ అభినందించారు. మీ మార్గం అనితరసాధ్యం, ప్రపంచానికే అది అనుసరణీయం అంటూ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. గాంధీజీ కూడా టాల్‌స్టాయ్‌ను అంతకు అంతా అభిమానించారు. మహాత్మా మన్నించు! ఆ రోజు జాతిపిత మహాత్మా గాంధీకి తెలియదు.. తన మాటకు భవిష్యత్తు పాలకులు తిలోదకాలిస్తారని..! నేనున్నానంటూ ఇచ్చిన భరోసా వట్టిమాట అవుతుందని..! గాంధీజీ పేరుతో రాజకీయాలు చేసే ప్రభుత్వాలు ఆయన ఆశయాలకు తిలోదకాలిస్తున్నాయని చెప్పే వాస్తవగాథ ఇది. గాంధీజీ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పేందుకు నిదర్శనం ‘ఘసెరా’ గ్రామం! దేశ రాజధాని ఢిల్లీకి కేవలం దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘసెరాలో మియో ముస్లింలు అధికంగా నివసిస్తున్నారు. దేశ స్వాతంత్య్రం, విభజన తర్వాత నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల్లో మహాత్మా గాంధీజీ ఘసెరాను సందర్శించి గ్రామ ప్రజలు పాకిస్థాన్‌కు వెళ్లొద్దని, భారతదేశంలోనే ఉండాలని కోరారు. గ్రామ ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన ఎంతో చొరవచూపిన కారణంగా గ్రామానికి ‘గాంధీ గ్రామ్ ఘసెరా’ అని పేరొచ్చింది. అయితే గాంధీజీ మాటపై గౌరవంతో ఘసెరాలో స్థిరపడిపోయిన స్థానిక ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక అవసరాలైన గృహ, తాగునీరు, రోడ్లు, విద్య, పారిశుధ్యం వంటి కనీస వసతులకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వీరి బతుకు మాత్రం మారట్లేదు. భూత్ బంగ్లా కాదు..గరీబోడి ఇల్లు.. నాటి మహాత్ముడి ప్రసంగ వేదిక ఇదే... -
బాపూ చూపిన బాటలో ఉన్నత శిఖరాలకు
‘‘పరుల బాధను తన బాధగా భావించగలవారే నిజమైన మహనీయులు’’ అన్నది బాపూజీకెంతో ఇష్టమైన శ్లోకం. ఏ భారతదేశం కోసం బాపూజీ తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించారో, ఎలాంటి సౌభాగ్య భారతం గురించి కలలుగన్నారో దాన్ని సాకారం చేయడం కోసం నేడు 130 కోట్లమంది భారతీయులం చిత్తశుద్ధితో కలసికట్టుగా కృషిచేస్తున్నాం. మన ప్రియతమ బాపూజీ 150వ జయంతి ఉత్సవాలను ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. ప్రపంచంలో సమానత, స్వాభిమానం, సార్వజనీనత, సాధికారతను ఆకాంక్షించే కోట్లాది ప్రజానీకానికి ఉజ్వల ఆశాజ్యోతిగా నేటీకీ ఆయనొక మార్గదర్శి. మానవ సమాజంపై ఆయన ప్రభావం అనుపమానం. మహాత్మాగాంధీ భారతదేశాన్ని ఆలోచన, కార్యాచరణలతో సంపూర్ణ అనుసంధానం చేశారు. ‘‘భారత్ వైవిధ్యభరిత దేశం. భిన్న త్వంలో ఏకత్వంగల మన దేశంవంటి దేశం ఈ భూమిపై ఎక్కడా లేదు. వలసపాలనపై పోరాటంలో ప్రజానీకాన్ని ఏకతాటిపై నడిపిన, భిన్నాభిప్రాయాలకు అతీతంగా ఏకీకృతం చేసిన, ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యాన్ని సమున్నతంగా నిలిపిన– వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మహాత్మా గాంధీ ఒక్కరే. అయితే, ఆయన సొంత గడ్డపైనుంచి కాకుండా దక్షిణాఫ్రికా నేలమీదనుంచే ఈ కృషికి శ్రీకారం చుట్టారు. తన కాలంకన్నా ఎంతో ముందుచూపుగల భవిష్యత్ దార్శనికుడాయన. తుదిశ్వాస విడిచేదాకా తన సిద్ధాంతాలకు కట్టుబడిన మహనీయుడు’’ అన్న సర్దార్ పటేల్ పలుకులు అక్షరసత్యాలు. మహాత్మాగాంధీ ఆలోచనలు ఆయన కాలంలో ఎంత ముఖ్యమైనవో ఈ 21వ శతాబ్దంలో కూడా అంతే ప్రాధాన్యంగలవి. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమ స్యలకు అవి పరిష్కారాలను సూచిస్తున్నాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం, దుశ్చర్యల దిశగా, విచక్షణరహిత విద్వేషం తదితరాలు అన్ని జాతులను, సమాజాలను నిట్టనిలువునా చీల్చుతున్న నేటి ప్రపంచ పరిస్థితులలోనూ మానవాళిని ఏకం చేయగల శక్తి ఆనాడు మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన శాంతి, అహింసా సిద్ధాంతాలకు ఉందనడంలో అతిశయోక్తి లేదు. అసమానతలు సహజమైపోయిన కాలంలో సమాన, సార్వజనీన ప్రగతికి బాపూ ఇచ్చిన ప్రాధాన్యం అట్టడుగునగల లక్షలాది ప్రజల శ్రేయోశకానికి బాటలు పరచగలదు. అలాగే వాతావరణ మార్పులు, పర్యావరణ పతనస్థాయికి చేరు తుండటం ప్రధాన చర్చనీయాంశాలైన ఈ శకంలో ప్రపంచం గాంధీజీ ఆలోచనలను మననం చేసుకోవాల్సి ఉంది. దాదాపు శతాబ్దం కిందట 1909లోనే మానవ ఆకాంక్షలు, మనిషి దురాశకు మధ్యగల వ్యత్యాసాన్ని ఆయన ప్రస్ఫుటం చేశారు. సహజ వనరుల వినియోగంలో సంయమనం, సహానుభూతిని ప్రబోధించడమే కాదు... ఈ ఆదర్శాన్ని పాటించడంలో తనకుతాను ఒక ఉదాహరణగా నిలిచారు. తన పరిసరాలను, తాను ఉపయోగించే మరుగుదొడ్డిని ఆయనే శుభ్రం చేసుకునేవారు. నీటి పొదుపును పాటించి వృథాను కనిష్ఠ స్థాయికి తగ్గించారు. మహాత్మాగాంధీ స్వహస్త లిఖితమైన ఓ ప్రస్ఫుట, సమగ్ర, సంక్షిప్త పత్రం ఒకటి కొంతకాలం కిందట నా దృష్టిని ఆకర్షించింది. బాపూ 1941లో ‘నిర్మాణాత్మక కార్య క్రమం: దాని అర్థం, స్థానం’ గురించి ఆ పత్రంలో వివరించారు. అయితే, ఆ తర్వాత స్వాతంత్య్రోద్యమం సరికొత్త ఉత్సాహం సంతరించుకున్న సందర్భంగా 1945లో ఆ పత్రాన్ని సవరించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయరంగ బలోపేతం, పారి శుధ్యం మెరుగు, ఖాదీకి ప్రోత్సాహం, మహిళా సాధికారత, ఆర్థిక సమానత్వ సాధన తదితర అంశాలపై బాపూ ఆ పత్రంలో ఆనాడే విస్తృతంగా చర్చించారు. ఈ నేపథ్యంలో గాంధీజీ ప్రబోధించిన ‘నిర్మాణాత్మక కార్యక్రమం’ (ఇది ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ లభ్యం) గురించి పూర్తిగా తెలుసుకోవాలని నా సహ భారతీయులను కోరుతున్నాను. బాపూజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మి ంచుకోవడంలో దాన్ని మనం కరదీపికగా ఉప యోగించుకోవాలని సూచిస్తున్నాను. బాపూ ఏడు దశాబ్దాల కిందట ప్రవచించినా అందులో నేటికీ రూపుదిద్దుకోని అనేక అంశాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనుసరణీయాలుగా స్వీకరించి అమలు చేస్తోంది. భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రతి ఒక్కరం కషి చేస్తున్నామన్న భావనను భారతీ యులందరిలోనూ ప్రోది చేయడమన్నది గాంధీజీ వ్యక్తిత్వంలోని అత్యంత అద్భుతమైన అంశాలలో ఒకటి. ఒక ఉపాధ్యాయుడు, న్యాయవాది, వైద్యుడు, రైతు, కార్మికుడు, పారిశ్రామికవేత్త... ఇలా వ్యక్తులెవరైనా, భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తామూ తమవంతు పాత్ర పోషి స్తున్నామన్న ఆత్మవిశ్వాసంతో కూడిన స్ఫూర్తిని వారిలో నింపారు. గాంధీజీ దార్శ నికతను వాస్తవం చేసేదిశగా ఆ మహనీయుని ఆదర్శాలను పాటించడంలో ఆయన చూపిన బాటలో నడుద్దాం. ఆహార వృథాను సంపూర్ణంగా అరికట్టడం వంటి అత్యంత సాధారణ అంశం నుంచి ఆయన బోధించిన అహింస, ఐకమత్యపు విలువలదాకా దేనితోనైనా మన కృషిని ప్రారంభించవచ్చు. భవిష్యత్తరాల కోసం పరిశుభ్రత, పచ్చని పర్యా వరణం దిశగా మన వంతు కార్యాచరణ ఏమిటో ఆలోచిద్దాం. దాదాపు ఎనిమిది దశాబ్దాల కిందట కాలుష్యం ముప్పు అంతగా లేనికాలంలోనే సైకిల్ వాడకాన్ని మహాత్మాగాంధీ అనుసరించారు. ఆ మేరకు గుజరాత్ విద్యాపీఠం నుంచి సబర్మతి ఆశ్రమందాకా ఆయన సైకిల్‌పై వెళ్లడాన్ని అహ్మదాబాద్ వాసులు నేటికీ జ్ఞాపకం చేసుకుంటారు. నిజానికి... దక్షిణాఫ్రికాలో గాంధీజీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో ఒకటి ప్రజలు సైకిల్ తొక్కడంపై ఆంక్షలు విధించడానికి నిరసనగా చేపట్టినదని నేనొక చోట చదివాను. న్యాయవాద వృత్తిలో పేరు ప్రతిష్ఠలు, ఆర్జన సమృద్ధిగా ఉన్న రోజుల్లోనూ ఆయన జోహాన్నెస్‌బర్గ్‌లో సైకిల్‌పైనే ప్రయాణించే వారట! ఆయన స్ఫూర్తిని మనం నేడు అనుసరించలేమా? ఈ పండుగలవేళ దేశవ్యాప్తంగా ప్రజలు కొత్త దుస్తులు, బహుమతులు, మిఠా యిలు, ఇతర తినుబండారాలు కొనుగోలు చేస్తున్నారు. ఇలా చేసే సమయంలో మనం గాంధీజీ చురుకైన ఆలోచనల పరంపర నుంచి కొన్నిటిని గుర్తు తెచ్చుకుందాం. మన చర్యలు మన సహ భారతీయులు తయారుచేసే వస్తువుల కొనుగోలు ద్వారా వారి జీవితాల్లో సౌభాగ్య దీపాన్ని ఎలా వెలిగించగలమో ఆలోచిద్దాం. అది ఖాదీ కావచ్చు... బహుమతిగా ఇచ్చే వస్తువు కావచ్చు లేదా తిను బండారం కావచ్చు... వాటిని కొనుగోలు చేయడంవల్ల మెరుగైన జీవితం దిశగా వారు చేస్తున్న ప్రయ త్నాలకు మనం ఎంతో తోడ్పడవచ్చు. స్వచ్ఛభారత్ ఉద్యమం రూపంలో గడచిన నాలుగేళ్లుగా 130 కోట ్లమంది భారతీయులు మహా త్మాగాంధీకి నివాళి అర్పి ంచారు. ప్రతి భారతీయుడి కఠోర శ్రమతో ఇవాళ్టితో నాలు గో ఏడాది పూర్తి చేసుకుంటున్న స్వచ్ఛభారత్ ఉద్యమం ప్రశంస నీయ ఫలితాలతో ఒక ఉత్తేజకర ప్రజా ఉద్యమ రూపుదాల్చింది. దేశంలో తొలిసారి 8.5 కోట్లకుపైగా కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 40 కోట్లమందికిపైగా భారతీయులకు నేడు బహిరంగ విసర్జన చేయాల్సిన దుస్థితి తప్పింది. కేవలం నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలోనే పారిశుధ్యం అందుబాటు 39 శాతం నుంచి 95 శాతానికి దూసుకుపోయింది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల 4.5 లక్షల గ్రామాలు ఇవాళ బహిరంగ విసర్జనరహితంగా మారాయి. స్వచ్ఛభారత్ ఉద్యమం మన గౌరవం, మెరుగైన భవిష్యత్తుకు ఉద్దేశించినది. ఇది కోట్లాది మహిళలకు శుభ సూచకం ప్రతి ఉదయం ప్రకృతి పిలుపు సమయంలో ముఖాలు దాచుకోవా ల్సిన దుస్థితి ఇకపై చరిత్రగా మిగిలిపోతుంది. కొన్ని రోజుల కిందట ఆకాశవాణి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో నేను ప్రసంగి స్తుండగా రాజస్తాన్ నుంచి ఒక దివ్యాంగ సోదరుడు నాకు ఫోన్ చేశాడు. రెండు కళ్లూ కనిపించని తన జీవితంలో వ్యక్తిగత మరుగుదొడ్డి ఎంతటి సానుకూల మార్పును తెచ్చిందో కళ్లకు కట్టినట్టు వివరించాడు. ఆ సమయంలో అతడినుంచి అందిన ఆశీర్వాదాలను నేను జ్ఞాపకాల్లో పదిలంగా దాచుకుంటాను. నేటి భారతీయులలో అత్యధిక శాతానికి నాటి స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యే అదష్టం లేదనే చెప్పాలి. ఇప్పటి మనలో చాలామందికి అప్పటి రోజుల్లో దేశం కోసం ప్రాణత్యాగం చేసే అవకాశం లేదు. కానీ, మన జాతి ప్రగతికి, మన స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న భారతదేశ నిర్మాణానికి వీలైనంత మేర శ్రమించడం కోసం మనం జీవించాల్సిన సమయమిది. బాపూజీ కలలు సాకారం చేసే గొప్ప అవకాశం ఇవాళ మన చేతుల్లో ఉంది. ఇప్పటికే మన మెంతో సాధిం చాం. రాబోయే రోజుల్లో మరెంతో సాధించగలమన్న దృఢవిశ్వాసం నాకుంది. ‘‘పరుల బాధను తన బాధగా భావించగలవారే నిజమైన మహనీయులు’’ అన్నది బాపూజీకెంతో ఇష్టమైన శ్లోకం. ఏ భారతదేశం కోసం బాపూజీ తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించారో, ఎలాంటి సౌభాగ్య భారతం గురించి కలలుగన్నారో దాన్ని సాకారం చేయడం కోసం నేడు మనం... 130 కోట్లమంది భారతీయులం చిత్తశుద్ధితో కలసికట్టుగా కృషిచేస్తున్నాం. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి -
బహుముఖ పోరాట యోధుడు బాపు
సమాచార మాధ్యమాలు అతి తక్కువగా ఉన్నకాలంలో జన ప్రయోజన రాజకీయ ఆచరణను ప్రజలకు తెలియచేసిన విజయవంతమైన నాయకుడు గాంధీజీ. విస్తృత స్థాయిలో తన వ్యక్తీకరణలు చేరాలని భిన్న పద్ధతులు ఉపయోగించిన విలక్షణ సామాజికుడు ఆయన. నిజానికి పొలిటీషియన్ అంటే సామాజికవేత్త అనే అర్థం. అనంతరకాలంలో అది ఒక సంకుచిత అర్థంలో రాజకీయవేత్త అయింది. సమాచార సాంకేతిక వ్యవస్థలు అంతంతమాత్రంగా ఉన్నప్పుడు వందేళ్లక్రితం ఆయన ఏ విధానాల ద్వారా, ఏ వ్యక్తీకరణలద్వారా దేశ ప్రజలకు స్వాతంత్య్ర పోరాట అవసరాన్ని తెలియజేసి, బ్రిటిష్ సామ్రాజ్య దురహంకార వలసవాద ప్రభుత్వానికి సవాలుగా నిలిచారన్నది గమనిస్తే గాంధీజీ విలక్షణ శైలి వెల్లడవుతుంది. ఒకపక్క విశాల ప్రజారాశిని కూడగట్టి, ఉద్యమాన్ని విస్తృతం చేయడంతోపాటు, తన కాలపు ప్రధాన సమాచార వ్యవస్థ పత్రికలేనని గుర్తించి పాత్రికేయునిగా వారిలో జాతీయోద్వేగ భరిత స్వాతంత్య్ర పోరాట కాంక్షను రగిల్చారు. దక్షిణాఫ్రికాలో ఉండగా ఒక పత్రికకు, మన దేశంలో మూడు పత్రికలకు సంపాదకత్వం వహించిన గాంధీజీ ఉత్తమశ్రేణి పత్రికా రచయిత అని చెప్పవచ్చు. దక్షిణాఫ్రికాలో భారతీయుల ఆత్మగౌరవ పోరాటం సమయంలోనే పత్రికల ద్వారా ప్రభుత్వంతో సంభాషించే సంస్కృతిని అలవరుచుకుని ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్ వంటి పత్రికలను నడిపారు. రాజకీయవేత్తలకు అవసరం అయిన మాటతీరు, ప్రసంగకళతోపాటు గాంధీజీకి రాత నైపుణ్యంకూడా ఉంది. ఏ విషయాన్నయినా గుజరాతీ, హిందీ భాషల్లో సూటిగా సరళంగా చెప్పడం ఆయనకే చెల్లింది. అన్నిటికీ మించి ‘టైమింగ్’(సరైన సమయంలో ప్రబలమైన పని చేయడం)ను విజయవంతంగా అమలు చేశారు. కాంగ్రెస్ కేవలం సంపన్నులకు, మధ్యతరగతికి పరిమితమైన దశలో గాంధీజీ ప్రవేశించి పునాది వర్గాలైన అట్టడుగు ప్రజానీకం, రైతులు, పేదలతో సజీవ సంబంధాలు నెలకొల్పారు. చంపారన్, నీల్ఛాస్(నీలిమందు పంట పండించటం) రైతుల ప్రయోజనాలకోసం పనిచేశారు. బ్రిటిష్ పాలకులకు నిర్మాణాత్మక పోరాటం ఎలా ఉంటుందో చవిచూపించారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ వంటి బీహార్ యువ నేతలతో అధ్యయనం చేయించి వందలాదిమంది రైతుల కడగండ్ల గురించి సవివరమైన నివేదికను రూపొందించి బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించారు. మొదట్లో గాంధీజీని కట్టడి చేయడానికి ప్రయత్నించి విఫలమైన ప్రభుత్వం చివరకు ఆ నివేదిక ఆధారంగా 1918 ఫిబ్రవరిలో నీలిమందు రైతుల కష్టాలను తీర్చడానికి చంపారన్ వ్యవసాయ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. తదుపరి కాలంలో అహ్మదాబాద్ కార్మికుల హక్కుల పోరాటం, రౌలట్ బిల్లు వ్యతిరేక ఆందోళన, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, చౌరీచౌరా జనాగ్రహం వంటి పరిణామాలు సాగుతున్నా భారత జాతీయోద్యమం పట్ల ప్రపంచ దృష్టి ఉండాల్సిన స్థాయిలో లేదని గాంధీజీ భావించారు. ఉప్పు సత్యాగ్రహం సమయానికి సమాచార రంగంలో కీలక మార్పు చోటు చేసుకుంది. 1929లో ఇంపీరియల్ కమ్యూనికేషన్స్ కంపెనీ అంతవరకూ పరిమితంగా ఉన్న కేబుల్ సమాచార వ్యవస్థను అట్లాంటిక్ సముద్రానికి ఆవల ఇంగ్లాండ్, యూరప్, బ్రిటిష్ వలసపాలిత ప్రాంతాకు విస్తరించింది. ఈ వ్యవస్థ ద్వారా వార్తలు అతి వేగంగా ప్రపంచానికంతకూ చేరతాయని గ్రహించిన గాంధీజీ, ఇతర నాయకులు దండియాత్ర, సత్యాగ్రహం వంటి పోరాటాలపై ప్రపంచ పౌరుల్లో అవగాహన పెంచారు. దీని ఫలితంగా మన స్వాతంత్య్ర పోరాటంపై అంతర్జాతీయంగా ఆసక్తి ఏర్పడింది. మనకు నైతికంగా మద్దతునిచ్చేవారు అంతకంతకు పెరిగారు. అమెరికా నుంచి వెలువడే టైమ్ పత్రిక రెండేళ్లలో రెండుసార్లు–1930లో ‘సెయింట్ గాంధీ’ అంటూ, 1931లో ‘మాన్ ఆఫ్ ద ఇయర్’ అంటూ గాంధీజీపై కవర్ పేజీ కథనాలను ఛాయాచిత్రాన్ని ముఖపత్రంగా ప్రచురించింది. ఆయన గ్రామగ్రామాన సాగించిన యాత్రలపై అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కథనాలు వెలువడటం బ్రిటిష్ పాలకుల్లో కూడా మార్పు తెచ్చింది. దండియాత్రకు ముందు చర్చలకు సిద్ధమని, అవసరమైతే యాత్ర కూడా నిలుపుదల చేస్తామని గాంధీజీ చెప్పినా పట్టించుకోని ఆ పాలకులు ఆ తర్వాత పునరాలోచనలో పడి చర్చలకు ఆహ్వానించారు. ఫలితంగా గాంధీ–ఇర్విన్ ఒడంబడిక సాధ్యపడింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా సాగిన ఆందోళనలు, అరెస్టులు, లాఠీచార్జ్ల గురించి అమెరికన్ పాత్రికేయుడు వెబ్ మిల్లర్ పంపిన వార్తాకథనం గమనిస్తే ఆ ఆందోళన ఏ స్థాయిలో జరిగిందో అర్ధమవుతుంది. ‘ఒక్క సత్యాగ్రహి కూడా తనపై పడుతున్న దెబ్బలను ప్రతిఘటించలేదు. ఏ రక్షణా లేని తలలపై లాఠీ దెబ్బలు పడే శబ్దం నాకు వెగటు, రోత కలిగించింది. మైదానమంతా తలలు పగిలినవారూ, భుజాల ఎముకలు విరిగినవారూ చేస్తున్న రోదనలతో నిండిపోయింది. వారి తెల్లని దుస్తులపై రక్తం మడుగులు కట్టింది. వరుసలో మిగిలినవారు కూడా ఏ మాత్రం జంకకుండా తమ వంతు వచ్చేవరకూ నడిచి పోలీసుల ముందుకు రావడం, దెబ్బలు తినిపడిపోవడం కనబడింది. ఈ అహింసాత్మక నిరసనకు పోలీసులు విసుగుచెంది ఒక్కుమ్మడిగా సత్యాగ్రహులందరిపై విరుచుకుపడి ఎక్కడబడితే అక్కడ లాఠీలతో బాదారు. వారిని వంద అడుగుల వరకూ ఈడ్చుకెళ్లి పక్కనున్న పొదలు, తుప్పల్లోకి లాగి పారేశారు’. ఈ ఉద్యమంపై రూపొందిన మిల్లర్ నివేదికను బయటకు పొక్కకుండా ఆపేందుకు బ్రిటిష్ పాలకులు విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు ప్రపంచ ప్రజల ఆగ్రహానికి జడిసి దాన్ని బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 1,350 పత్రికలు దాన్ని ప్రచురించాయి. భారత్‌ను తాము న్యాయబద్ధంగా పాలిస్తున్నామంటూ వలస పాలకులు చెబుతున్నదంతా బూటకమని దండియాత్ర దండోరా వేసింది. వారి పాలనపై దండి సత్యాగ్రహం తొలి గొడ్డలి వేటు. భిన్న మార్గాల్లో ప్రజలతో నిరంతరం సంబంధబాంధవ్యాలను నెలకొల్పుకోవటం, సాధారణ దుస్తులు ధరించి సామాన్యులతో కలిసిపోవటం గాంధీజీకే చెల్లింది. శ్రేయోదాయక సామాజిక లక్ష్యాన్ని సంకల్పించి, అందుకోసం ఎంతగానో కృషి చేసి తన జీవితకాలంలోనే దాన్ని సాధించిన అరుదైన ప్రపంచ రాజకీయ నాయకుల్లో గాంధీజీ ముఖ్యులు. నిరంతర జన సంపర్కం, నిరాడంబరత, పట్టుదల, అద్భుతమైన భావవ్యక్తీకరణ ఆయన నుంచి ఈ తరం నేర్వదగిన గొప్ప సుగుణాలు. ఈ ఏడాది పొడవునా దేశ ప్రజలు జాతిపితను భిన్న కోణాల్లో అధ్యయనం చేయడం ద్వారా ఆయన స్ఫూర్తి పరివ్యాప్తం కావడానికి కృషి చేస్తారని ఆశిద్దాం. రామతీర్థ, ప్రముఖ కవి మొబైల్: 9849200385 -
డబ్బుల్లేకుండా గబ్బు వదిలేదెలా
నేటినుంచి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం రాజధాని నగరంలో క్షీణిస్తున్న పారిశుధ్యం రూ.461 కోట్ల నిధులు హైజాక్ మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ గడపదాటని చందంగా సర్కార్ తీరు తయారైంది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సమయంలో నిధుల్లేకుండా స్వచ్ఛత ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సుందరీకరణ, రోడ్ల విస్తరణపై చూపుతున్న శ్రద్ధలో పదో వంతు పారిశుధ్య పనులపై పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.