సుప్రీం తీర్పు సింగరేణికి వర్తించదా..?
బీజేపీ నేత కిషన్‌రెడ్డి
సాక్షి, కొత్తగూడెం: సింగరేణి సంస్థ కార్మికుల శ్రమను దోచుకుంటోందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు సంస్థకు వర్తించదా? అని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు సోమ వారం కొత్తగూడెంలో సింగరేణి సైరన్ పేరిట యాత్ర నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సింగరేణిలో ప్రకటించిన వారసత్వ ఉద్యోగాలను షరతులు లేకుండా అర్హులైన వారందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులున్నారు.