రంగారెడ్డి జిల్లా: ఎన్నికల వ్యయం నమోదులో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి (కాంగ్రెస్) ఎలక్షన్ కమిషన్‌ను తప్పుదోవ పట్టించారని మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ నేతలు విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 26 నాటికీ రూ.22.15 లక్షలు ఖర్చు చేసినట్లు స్వయంగా టీఆర్‌ఆర్ రికార్డు చేశారని, చేవెళ్లలో సోనియా సభ ప్రచార ఖర్చు రూ.14.30 లక్షలు కూడా జమ చేయడంతో ఆయన నిర్దేశిత ఎన్నికల వ్యయాన్ని మించిపోయారన్నారు.
సోనియా ప్రచార వ్యయం తన ఖాతాలో చూపరనే ధీమాతో రామ్మోహన్‌రెడ్డి పోలింగ్‌కు మూడు రోజుల ముందు రూ.22 లక్షలు ఖర్చయినట్లు పేర్కొన్నారని, దీన్ని ధ్రువపరుస్తూ రిటర్నింగ్ అధికారి సంతకం చేశారని అన్నారు. ఊహించని రీతిలో సోనియా ప్రచార ఖర్చు కూడా జమ కావడంతో రికార్డులను తారుమారు చేసినట్లు ఆరోపించారు.
ఈసీని తప్పుదోవ పట్టించిన పరిగి ఎమ్మెల్యే
Published Tue, Jun 24 2014 3:24 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement