సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌లు బుధవారం మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ రోజు మధ్యాహ్నం ఎస్‌ఆర్ నగర్ మెట్రోస్టేషన్‌లో రైలెక్కి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణం చేశారు. అక్కడ జరుగుతున్న మెట్రో పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మెట్రో రైలులో బయలుదేరి ఎస్‌ఆర్ నగర్ మెట్రోస్టేషన్‌కు చేరుకున్నారు. గవర్నర్‌తో పాటు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శేఖర్ ప్రసాద్ సింగ్ పాటు పలువురు అధికారులు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు పారంభం కానున్న సంగతి తెల్సిందే.
Hon’ble Governor Sri ESL Narasimhan Garu has personally visited & reviewed readiness for Hyderabad Metro 🚇 launch on 28th Nov. All set to go👍 https://t.co/0OJLw0JCx0
— KTR (@KTRTRS) 8 November 2017
Comments
Please login to add a commentAdd a comment