దేవినేని త్వరలో మాజీమంత్రి కాబోతున్నారు | KTR counter attack to devinenu uma comments on power crisis | Sakshi
Sakshi News home page

దేవినేని త్వరలో మాజీమంత్రి కాబోతున్నారు

Published Sat, Oct 25 2014 2:03 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

దేవినేని త్వరలో మాజీమంత్రి కాబోతున్నారు - Sakshi

దేవినేని త్వరలో మాజీమంత్రి కాబోతున్నారు

హైదరాబాద్ :  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తిపై రగడ రాజుకుంది.  ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎదురు దాడి చేశారు. దేవినేని వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేవినేని ఉమ త్వరలో మాజీ మంత్రి కాబోతున్నారని కేటీఆర్ కౌంటర్ వేశారు. ఆయన తన పదవికి వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

చంద్రబాబు నాయుడు జారీ చేసిన జీవోలు సంగతి దేవినేనికి తెలియవని కేటీఆర్ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తికే నిర్మించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన శనివారమిక్కడ అన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే ఇందుకు సంబంధించిన జీవోలు విడుదల అయ్యాయని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement