కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తేనే నేరెళ్ల బాధితులకు న్యాయం జరుగుతుందని కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి బి.అభినవ్ అన్నారు.
ఇసుక మాఫియాతో చేతులు కలిపిన ప్రభుత్వం నేరెళ్ల బాధితులను ఆదుకు నేందుకు ముందుకు రావడంలేదని విమర్శిం చారు. అమాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్పీపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులపై కండిషన్ బెయిల్ ఎత్తివేసి మెరుగైన వైద్యం కోసం హైద రాబాద్ తరలించాలని వారు డిమాండ్ చేశారు.