సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదివారం ఉదయం నగరం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ సదస్సులో భాగంగా నిర్వహించే పలు చర్చల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడనున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేయనున్నారు. ప్రపంచ దేశాల నుంచి ఈ సదస్సుకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment