
సీనియర్ లీడర్‌ను ఫోకస్ చేసి ఉంటే..
సమర్థ నాయకత్వం లేనందునే ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు.
హైదరాబాద్: సమర్థ నాయకత్వం లేనందునే ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ లీడర్‌ను ఫోకస్ చేసి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదేమోనని అభిప్రాయపడ్డారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆక్షేపించారు. హామీలపై స్పష్టమైన కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించలేదని విమర్శించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.