భద్రాద్రి ఆలయంలో కీలక మార్పులు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామాయలంలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 14 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఉన్నపళంగా తప్పించారు. అలాగే 100 గ్రాముల లడ్డూ సైజును 80 గ్రాములకు కుదించారు. రెగ్యులర్‌గా ఉండే ఉద్యోగులను అంతర్గతంగా బదిలీలు చేశారు. ఇంత అత్యవసరంగా మార్పులు ఎందుకు చేశారో తెలియరాలేదు.