నాయకత్వ శక్తి బ్రాహ్మణులకే ఉంది | Leadership energy is brahmanula | Sakshi
Sakshi News home page

నాయకత్వ శక్తి బ్రాహ్మణులకే ఉంది

Published Sun, Oct 12 2014 2:58 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

Leadership energy is brahmanula

హన్మకొండ కల్చరల్ : సమాజానికి నాయకత్వం వహించే శక్తి సామర్థ్యాలు బ్రాహ్మణులకే ఉన్నాయని, వారు సమాజానికి దిశా నిర్ధేశం చేయగలరని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. శనివారం ఎంజీఎం సమీపంలోని శ్రీరాజేశ్వరీ దేవి ఆలయ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ బ్రాహ్మణ సంఘం ఎన్నికల కార్యక్రమంలో శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గంచే ప్రమాణస్వీకారం చేయించారు.

అనంతరం మాట్లాడుతూ విజ్ఞానవంతులు, విజ్ఞులైన బ్రాహ్మణులను మెజార్టీ ప్రజలు గౌరవిస్తారని, అయితే వారంతా ఆస్తిపరులు మాత్రం కాదని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు మృత్యుంజయశర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, మాజీ ఎమ్మెల్యే కెప్టెన్ లక్ష్మీకాంతారావు, తెలంగాణ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన వెన్నంపల్లి జగన్‌మోహన్‌శర్మ, కార్యదర్శి మోర్పట్ల హనుమంతరావు, కోశాధికారి కొడకండ్ల రామగిరిశర్మ, బ్రాహ్మణ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు  వి.విశ్వనాథం, అధ్యక్షుడు ఐనవోలు వెంకటసత్యమోహన్, కార్యదర్శి జీవీఎస్ శ్రీనివాసాచారితోపాటు ఎన్నికైన ఉపాధ్యక్షులు ఇతర కార్యవర్గ సభ్యులు, జిల్లాల నుంచి వచ్చిన బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement