మొయినాబాద్: ఆరు రోజుల క్రితం గగన్‌పహాడ్–కాటేదాన్ మధ్య రైల్వే అండర్‌పాస్‌లో ప్రత్యక్షమై సమీపంలోని అన్మోల్ గార్డెన్‌లోకి వెళ్లి తప్పించుకున్న చిరుతపులి ఎక్కడికెళ్లిందో ఇంతవరకూ అంతు చిక్కడంలేదు. హిమాయత్‌సాగర్ జలాశయం పరిసరాల్లో సంచరిస్తుందన్న ప్రచారంతో అటవీశాఖ అధికారులు ఆరు రోజులుగా గాలిస్తున్నా చిరుత జాడ కనిపించడంలేదు. ఇటు చిలుకూరు మృగవని అటవీ శాఖ అధికారులు, అటు శంషాబాద్ జోన్ అటవీ శాఖ అధికారులు హిమాయత్‌సాగర్ జలాశయం చుట్టూ గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు.
అయినా ఇంత వరకు చిరుత ఆచూకీ మాత్రం దొరకలేదు. చిరుతను గుర్తించడంకోసం హిమాయత్‌సాగర్ జలాశయం పక్కన ఉన్న జీవీకే ఫాంహౌస్‌లో అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం జీవీకే ఫాంహౌస్‌లో చిరుత కనిపించిందని సెక్యూరిటీ గార్డు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు ఫాంహౌస్‌లోని సీసీ కెమెరాల్లో, పరిసరాలను సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం పరిశీలించగా జంగపిల్లులు(అడవి పిల్లులు) సంచరించినట్లు గుర్తించారు. ఇక్కడ చిరుత సంచారం లేదంటూ నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment