![నిరుద్యోగ సమస్యపై ఉద్యమిద్దాం](/styles/webp/s3/article_images/2017/09/5/71495825942_625x300.jpg.webp?itok=hPjV21V8)
నిరుద్యోగ సమస్యపై ఉద్యమిద్దాం
జాతీయ సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్ చేతన్ బీ సంఘీ
సాక్షి, హైదరాబాద్: దేశంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాలు నిరుద్యోగమేనని జాతీయ సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్ చేతన్ బీ సంఘీ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న వారిలో 35 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నారని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శుక్రవారం జరిగిన జాతీయ సాంఘిక సంక్షేమ మండలి సదస్సులో ఆయన పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి మహిళకు చేరేలా రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండళ్లు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్రం మహిళల కోసం తలపెట్టిన కార్యక్రమాల్ని ప్రారంభించేందుకు త్వరలో రాష్ట్రాని కి కేంద్ర మంత్రి మేనకాగాంధీ రానున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్ చెప్పారు. సదస్సులో వివిధ రాష్ట్రాల ఎస్ డబ్ల్యూబీ చైర్‌పర్సన్లు, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ పాల్గొన్నారు.