జూన్‌లోనే రుణాలు అందజేయాలి | Loans shall be provided in June | Sakshi
Sakshi News home page

జూన్‌లోనే రుణాలు అందజేయాలి

Published Sun, Jun 5 2016 2:05 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

జూన్‌లోనే రుణాలు అందజేయాలి - Sakshi

జూన్‌లోనే రుణాలు అందజేయాలి

రైతు సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు   చంద్రకుమార్

జన్నారం : జూన్‌లోనే రుణాలు అందజేసి రైతులకు చేయూతనివ్వాలని రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు చంద్రకుమార్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని తిమ్మాపూర్‌లో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ పూర్తిగా చేస్తేనే బ్యాంకర్లు రుణాలిస్తామని షరతులు విధిస్తున్నందున ప్రభుత్వం జూన్‌లోనే రుణాలందేలా చర్యలు చేపట్టాలన్నారు.

సబ్సీడి విత్తనాలు కూడ రైతులకు జూన్‌లోనే అందేలా చూడాలన్నారు. సమావేశంలో రిటైర్డ్ న్యాయమూర్తి కే. రాజన్న, సర్పంచులు అల్లం వెంకటరాజం, వెంకటస్వామి, నాయకులు ప్రకాశ్‌నాయక్, ప్రభుదాస్, బాపన్న, వెంకట్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement