బంజారాహిల్స్:ప్రేమికుడు తనతో గడిపిన చిత్రాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి తన స్నేహితులకు వాట్సప్ ద్వారా పంపించాడని యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. షేక్‌పేట నారాయణమ్మ కళాశాల వద్ద మహిళా హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న యువతి (22) ఇదే ప్రాంతంలో నివసిస్తున్న ఓరుగంటి శ్రీకాంత్ అనే యువకుడిని గత నవంబర్ నుంచి ప్రేమిస్తోంది. పెళ్లి చేసుకుంటానని శ్రీకాంత్ నమ్మించడంతో శారీరకంగా ఒకటయ్యారు. ఇటీవల ఆమెకు తెలియకుండా ఆమెతో గడిపిన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. వీటిని తన స్నేహితులకు పంపించాడు. అంతటితో ఊరుకోకుండా పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే ఫేస్‌బుక్‌లో నగ్న చిత్రాలు పెడతానంటూ ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.
తాను కోరుకున్నంత కాలం తనతో గడపాలని, పెళ్లిపేరుతో చికాకు తెప్పించొద్దని హెచ్చరించాడు. దీంతో కొంత కాలంగా శ్రీకాంత్ చెప్పిన విధంగా సదరు యువతి నడుచుకుంటోంది. విసిగి వే సారిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శ్రీకాంత్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 354-సీ, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.