సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ వ్యవహారంపై హైదరాబాద్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. బాధ్యులపై సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం మంగళవారం ఈ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, ఎలాంటి ఫీజు లేకుండా రీవాల్యుయేషన్ చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. గ్లోబరీనా టెక్నాలజీ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కోరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం తర్వాత విచారణ జరగనుంది.
ఇంటర్ బోర్డ్ వద్ద కొనసాగుతున్న ఆందోళనలు
రెండో రోజు కూడా ఇంటర్ బోర్డ్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అక్కడికి భారీ ఎత్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. విద్యార్థులను లోపలికి అనుమతించకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు. అవతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రీకౌంటింగ్‌కే రేపే చివరి గడువు కావడం.. వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్ యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment