వైఎస్సార్సీపీ మహబూబ్‌నగర్ జిల్లా న్యాయవిభాగం అధ్యక్షునిగా మద్దిరాల | Maddirala selected as a Mahabubnagar YSRCP Legal cell president | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ మహబూబ్‌నగర్ జిల్లా న్యాయవిభాగం అధ్యక్షునిగా మద్దిరాల

Published Thu, Jun 18 2015 6:01 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

వైఎస్సార్సీపీ మహబూబ్‌నగర్ జిల్లా న్యాయవిభాగం అధ్యక్షునిగా మద్దిరాల - Sakshi

వైఎస్సార్సీపీ మహబూబ్‌నగర్ జిల్లా న్యాయవిభాగం అధ్యక్షునిగా మద్దిరాల

వనపర్తి రూరల్ (మహబూబ్‌నగర్) :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా న్యాయవిభాగం అధ్యక్షునిగా వనపర్తికి చెందిన నేత మద్దిరాల విష్ణువర్దన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నియామక ఉత్తర్వులను గురువారం శ్యాంసుందర్‌రెడ్డి చేతుల మీదుగా విష్ణువర్దన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుకున్నారు. తనపై నమ్మకం ఉంచి పార్టీలో ఉన్నత స్థానం కల్పించిన పెద్దల ఆదేశం మేరకు పార్టీ అభివృద్ధ్ది కోసం కృషి చేస్తానని విష్ణువర్దన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయనతో పాటు స్థానిక నాయకులు భాస్కరాచారి, రాజశేఖర్, మహేష్, బుడ్డన్న, జైపాల్‌రెడ్డి, వెంకట్రావ్, వెంకటేష్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement