జోగుళాంబ జిల్లా చేయాలి
Published Sun, Sep 4 2016 12:14 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
అలంపూర్‌రూరల్: ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా బాసిల్లుతున్న జోగుళాంబ అమ్మవారి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాల్సిందేనని వైఎస్సాఆర్‌సీపీ తాలూకా ఇన్‌చార్జ్ జెట్టి రాజశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం అలంపూర్ ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. డీకే అరుణ జోగుళాంబ జిల్లా కావాలని చేస్తున్న పోరాటం హర్షించదగ్గదే కానీ, ఏక పక్షంగా పోరాటం చేస్తుండటంతో పెద్దగా స్పందన రావడం లేదన్నారు. కే వలం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి మాత్రమే పోరాటం చేస్తుండటంతో మిగితా పార్టీల మద్ధతును కోల్పోతున్నారని అన్నారు. ఇప్పటికైనా జోగుళాంబ జిల్లా సాధన కోసం అన్ని పారీల్ట నాయకులను కలసి అందరినీ సమన్వయం చేసుకుని పోరాడితే జిల్లాను సాధించవచ్చన్నారు. ఒక వ్యక్తి కి ఇచ్చిన మాట కోసం జిల్లా చేయడం ఎంత వరకు సమంజసం అనేది కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. నడిగడ్డ ప్రజల కోసం, అలంపూర్ ప్రాంత అభివృద్ది కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చివరి దాక నిలపడుతుందని అన్నారు. జోగుళాంబ జిల్లా కోసం హైద్రాబాద్‌లో చేస్తున్న నిరాహార దీక్షకు తమ పార్టీ తరపున కార్యకర్తలు తరలివెళుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ, మండల కార్యదర్శి శేఖర్‌రెడ్డి, నాయకులు అశోక్‌గౌడ్ , బండారి రాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement