సాక్షి, హైదరాబాద్ : మహింద్రా ఎకోల్ సెంట్రల్(ఎంఈసీ) కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ 2018-19 విద్యా సంవత్సరానికి గాను తమ హైదరాబాద్ క్యాంపస్‌కు సంబంధించి నాలుగేళ్ల బీటెక్ ప్రొగ్రామ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు స్పెషలైజేషన్లలో మొత్తం 240 సీట్లను అందుబాటులో ఉంచింది. ఒక్కో స్పెషలైజేషన్‌కు 60 సీట్లు కేటాయించింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీర్ స్పెషలైజేషన్లను ఎంఈసీ ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో ఏదైనా చట్టబద్దమైన బోర్డు నుంచి 10+2 పూర్తి చేసిన వారు, ఐబీ లేదా ఇతర ఆమోదం పొందిన బోర్డుల్లో సమానమైన గ్రేడ్లతో అర్హత సాధించిన విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంఈసీ పేర్కొంది.
జేఈఈ మెయిన్ 2018(2,20,000 వరకు ర్యాంకు పొందిన వారు లేదా జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌లో అర్హత సాధించవారు) లేదా చెల్లుబాటు అయ్యే SAT స్కోర్స్(మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి ఉండే సబ్జెట్లలో కనీసం 1800 మార్కులు పొందడం) బట్టి ఈ అడ్మిషన్లను ఆమోదిస్తున్నట్టు కాలేజీ తెలిపింది. ప్రస్తుతం అప్లికేషన్ పోర్టల్‌లో కాలేజీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. 2017 జూలై 7 వరకు అప్లికేషన్లను ఫైల్ చేసేందుకు గడువు ఇచ్చింది. మే 7వ తేదీ కంటే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి మే 31 లేదా జూన్ 1న తొలి రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment