ప్రమాదకరంగా మల్లంపల్లి బ్రిడ్జి
రోజురోజుకూ కుంగుతున్న వంతెన
ఉన్నతాధికారులకు నివేదిక అందించిన ఏఎస్పీ!
ములుగు : సమ్మక్క-సారలమ్మ జాతరకు మేడారం వచ్చే వేలాది వాహనాల తాకిడిని మల్లంపల్లి-జాకారం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి తట్టుకోగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. మల్లంపల్లి ప్రాంతంలో కాకతీయ కెనాల్‌పై నిర్మించిన ఈ వంతెన నానాటికీ కుంగిపోతోంది. ప్రస్తుత గిరిజన సంక్షేమ శాఖా మంత్రి అజ్మీరా చందూలాల్ 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఈ బ్రిడ్జి నిర్మించారు. కెనాల్ నుంచి బ్రిడ్జి ఎత్తు దూరంగా ఉండడంతో అప్పటి ఇంజనీరింగ్ నిపుణుల ఆలోచనతో పిరమిడ్ నిర్మాణంలా ఒక్కో రారుు పేర్చుతూ వచ్చారు. అయితే ఆ బండల మధ్య చిన్న చిన్న మొలకలు వచ్చి ప్రస్తుతం వాటి వేర్లు విస్తారంగా వ్యాపించాయి. దీంతో రాళ్ల మధ్యలో గ్యాప్ ఏర్పడి పక్కకు జరుగుతున్నాయి. ఇలా బ్రిడ్జి క్రమంగా కుంగుతుండడంతో 2007లో అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. కాగా, అప్పటివరకు ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న ఈ రోడ్డు 2007లో జాతీయ రహదారి(ఎన్‌హెచ్) పరిధిలోకి వచ్చింది. 2010లో ఎన్‌హెచ్ అధికారులు బ్రిడ్జి పనులకు మరమ్మతులు చేపట్టారు. ఇక ఆ తర్వాత కూడా వంతెన కుంగుతున్నప్పటికీ ఏ అధికారీ పట్టించుకోలేదు.
పొంచి ఉన్న ప్రమాదం..
2010లో ఎన్‌హెచ్ అధికారులు మరమ్మతులు చేపట్టినప్పటితో పోలిస్తే ఇప్పుడు బ్రిడ్జి పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. రెండు వైపులా నిర్మించిన సేఫ్టీ వాల్స్ కొంతమేర కూలిపోగా, ఉన్నచోట కూడా కుంగి రోడ్డుకు సమాన ఎత్తుకు చేరారుు. మేడారం మహా జాతర సందర్భంగా రూట్ మ్యాప్‌ను పరిశీలించిన పోలీసు అధికారులు కుంగుతున్న బ్రిడ్జిని గమనించారు. ప్రమాదం పొంచి ఉందని ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అరుుతే ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో జాతర సమయంలో ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగేదెలా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
60 శాతం మంది ఈ దారి నుంచే..
మేడారం జాతర భక్తులలో సుమారు 60 శాతం మంది ఈ దారి నుంచే వస్తుంటారు. హైద్రాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల భక్తులకు ఇదే మార్గం. బ్రిడ్జి సేఫ్టీ వాల్స్ జాయింట్లు విరిగిపోయాయి. జాతరకు వచ్చే వాహనాదారులు దీన్ని గమనించకుంటే సుమారు 100 మీటర్ల లోతులో ఉన్న కాలువలో పడిపోయే ప్రమాదం ఉంది. ఏదేనీ ప్రతికూల పరిస్థితుల్లో బ్రిడ్జి ఇబ్బంది పెడితే.. భక్తులకు తిప్పలు తప్పవు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.
ముంచుకొస్తున్న ముప్పు
Published Thu, Jan 14 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM
Advertisement