కేసీఆర్ది రైతు వ్యతిరేక ప్రభుత్వం
నిజామాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల వ్యతిరేక ప్రభుత్వమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఉదయం నిజామాబాద్ జిల్లా దర్పల్లి, సిరికొండ మండలాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీనియర్ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ తదితరులతో కలసి భట్టి పరిశీలించారు. బాధిత రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ... పంటలను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.