ఖమ్మం (తిరుమలాయపాలెం) : భార్య హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి సోమవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరుమలాయపాలెం మండలం గోల్‌తాండ గ్రామానికి చెందిన గుగులోత్ సురేష్(30), స్వరూప భార్యాభర్తలు. సురేష్ రోజూ తాగి వచ్చి భార్యను నిత్యం వేధిస్తుండేవాడు. ఈ నేపధ్యంలోనే ఈ నెల 17న స్వరూప తన ఇంట్లో అనుమానాస్పదస్థితిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఆత్మహత్యతో భర్త సురేష్ పరారయ్యాడు.
మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా 18వ తారీఖున స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. తర్వాత మృతురాలి బంధువులు 'నిన్ను ఏ రోజైనా మేమే చంపేస్తాం' అని హెచ్చరించడంతో భయపడి స్టేషన్‌లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతనిని ఖమ్మంలోని అభయ అనే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.
భార్య హత్యకేసులో నిందితుడు మృతి
Published Mon, Sep 28 2015 4:22 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement