చందంపేట (దేవరకొండ) : కులం పేరుతో దూషించాడని మనస్తానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం నేరెడుగొమ్ము మండల కేంద్రం లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శీల తిరుపతయ్య(40) గ్రామ సమీపంలో తనకున్న ఎకరన్నర భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. గత నెల 22న తన పొలం బావి పక్కనే రైతు సంగెం సత్యనారాయణ బోరు వేశాడు. దీంతో తన బావి ఎండిపోతుందని స్థానిక తహసీల్దార్‌కు తిరుపతయ్య ఫిర్యాదు చేశాడు. దీంతో రెవెన్యూ అధికారులు బోరును సీజ్ చేశారు. కాగా ఆదివారం మధ్యాహ్నం తిరుపతయ్య తన పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ క్రమంలోనే తన బోరును సీజ్ చేయించాడని తిరుపతయ్యపై కక్ష పెంచుకున్న సంగెం సత్యనారాయణ, కుమారులు యాదయ్య, వెంకన్న తిరుపతయ్యపై దాడి చేశారు.
స్థాని కులు గమనించి అడ్డుకొని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుదామని ఇరువురికి నచ్చజెప్పి పంపించారు. తిరిగి అదేరోజు రాత్రి తిరుపతయ్య ఇంటిపై సత్యనారాయణ కుటుంబ సభ్యులపై దాడి చేసి కులం పేరుతో దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపతయ్య ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే మతిచెందాడు. తిరుపతయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..
తిరుపతయ్య మతి చెందిన విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాంగోపాల్‌రావు ఘటన స్థలానికి చేరుకుని మతుని బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో మతదేహాన్ని పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నేరెగుడుగొమ్ము మండల కేంద్రంలో పోలీసుల పికెట్ ఏర్పాటు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment