వరంగల్: ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలోని గూడూరులో సోమవారం చోటుచేసుకుంది. సెంకేషి సత్యనారాయణ అనే కానిస్టేబుల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సత్యనారాయణ గూడూరులో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సత్యనారాయణ ఆత్మహత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని బంధువులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.