కుటుంబ కలహాలతో ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇద్దరు చిన్నారులూ మృతి
గద్వాల: కుటుంబ కలహాలతో ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా గద్వా లకు చెందిన కుర్మన్న(35), రాజ్యమ్మ బిందెల వ్యాపారం చేస్తున్నారు.
వీరి సంతానం కుర్మక్క(9), నాని, ఇందు(5). భార్యప్రవర్తనపై అనుమానంతో కుర్మన్న తరచూ ఆమెతో గొడవపడేవాడు. దీంతో మూడురోజుల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన కుర్మన్న శనివారం రాత్రి కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపి పిల్లలకు తాగించి తానూ సేవించాడు. పరిస్థితి విషమించడంతో తండ్రితో పాటు కుర్మక్క, ఇందు మృతి చెందారు. నాని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.