వికారాబాద్‌లో కల్తీ కల్లు కలకలం | man died due to Adulterated liquor | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో కల్తీ కల్లు కలకలం

Published Fri, Jul 8 2016 3:31 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

man died due to Adulterated liquor

వికారాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగడి గ్రామంలో కల్తీ కల్లు తాగి నీరొద్దిన్(30) అనే వ్యక్తి మృతి చెందాడు. ఉదయం నమాజ్ చేసుకున్న తర్వాత కల్లు తాగగానే అపస్మారకస్థితిలోకి వెళ్లి ప్రాణాలు వదిలాడు. దీంతో బంధువులు కల్లు కాంపౌండ్‌ను ధ్వంసం చేసి శవంతో రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement