నిజామాబాద్:
వ్యవసాయం పై మక్కువతో తనకున్న ఐదు ఎకరాల్లో సేద్యం చేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. పొలంలో విద్యుత్ షాక్‌తో ప్రాణాలొదిలాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని శంకోరా గ్రామానికి చెందిన పిరోజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అలాగే తనకున్న ఐదు ఎకరాల్లో సేద్యం చేస్తున్నాడు. శనివారం తెల్లవారు జామున వరి నారుమడిని తడిపేందుకు పొలం వెళ్లాడు. అయితే మోటారుకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను సరిచేస్తుండగా షాక్‌కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.