కోనరావుపేట(కరీంనగర్ జిల్లా): మతిస్థిమితం కోల్పోయిన ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని గద్దె గట్టు చెరువు సమీపంలో జరిగింది. వివరాలు.. ఆదివారం చెరువు సమీపంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాగా, ఆ వ్యక్తిని గతంలో కోనరావుపేట మోడల్ స్కూల్‌లో పని చేసిన ప్రిన్స్‌పాల్ రాజేష్(40)గా గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గతంలో రాజేష్ మద్యానికి బానిస కావడంతో అధికారులు అతనిని విధుల నుంచి తొలంగించారు. ఈ నేపథ్యంలోనే మతిస్థిమితం కోల్పోయిన అతను విధుల వెంటనే తిరుగుతూ ఉండేవాడు.
ఈ క్రమంలో ఆదివారం నిజామాబాద్ గ్రామంలోని చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఒంటిపై ఒట్టలు లేకుండా ఉండటం, శరీరం మొత్తం రంగు మారిపోయి నల్లగా కావడంతో వడదెబ్బతో మృతి చెందాడా, లేక వేరే ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాజేష్ కుటుంబసభ్యులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి రాజేషేనా? కాదా అని కుటుంబసభ్యలు తేల్చాల్సి ఉంది.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
Published Sun, May 3 2015 2:24 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM
Advertisement
Advertisement