- యువకుడికి గ్రామస్తుల దేహశుద్ధి
కీసర (రంగారెడ్డి జిల్లా) : అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేయగా గ్రామస్తులు దేహశుద్ధి చేసిన సంఘటన కీసర మండలం హైమత్‌గూడలో మంగళవారం జరిగింది. హైమత్‌గూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిని అజయ్(18) అదే కాలనీకి చెందిన ఓ చిన్నారిని ఆడుకుందాం రమ్మని పిలిచాడు.
అమాయకంగా వెళ్లిన ఆ చిన్నారికి తన సెల్‌లోని అసభ్య ఫొటోలు చూపిస్తూ అత్యాచారం చేయబోయాడు. ఈ సంఘటనను అదే కాలనీకి చెందిన సమీ, రహీంలు చూసి కాలనీ వాసులను పిలిచారు. చిన్నారిపై అత్యాచారం చేయబోయిన అజయ్‌కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
Published Tue, May 3 2016 3:11 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement