వ్యక్తి అదృశ్యం | Man missing | Sakshi

వ్యక్తి అదృశ్యం

Nov 19 2015 8:01 PM | Updated on Aug 29 2018 8:36 PM

ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

యాకుత్‌పురా (హైదరాబాద్) : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం ఎస్సై గణేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం... మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఎజాజ్ (40) ఈ నెల 16వ తేదీన ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లతో పాటు సాధ్యమైనన్ని ప్రాంతాల్లో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఎజాజ్ భార్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement