భార్యను నిర్బంధించి... భర్తను ఎత్తికెళ్లి చంపేశారు | Man murdered in medak district | Sakshi
Sakshi News home page

భార్యను నిర్బంధించి... భర్తను ఎత్తికెళ్లి చంపేశారు

Published Thu, Jul 2 2015 9:42 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

భార్యను నిర్బంధించి... భర్తను ఎత్తికెళ్లి చంపేశారు - Sakshi

భార్యను నిర్బంధించి... భర్తను ఎత్తికెళ్లి చంపేశారు

మెదక్: మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులో దారుణం చోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి కొంతమంది దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి భార్యను తాళ్లతో నిర్బంధించి భర్తను అపహరించుకుని పోయారు. అనంతరం అతడిని గ్రామ శివారులో హత్య చేసి దుండగులు పరారైయ్యారు.

భార్య గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్థులు వెంటనే స్పందించి.... ఆమెను విడిపించారు. భర్త కోసం ఆమె గ్రామస్థుల సహాయంతో వెతకనారంభించింది.  ఆ క్రమంలో గ్రామ శివారులో భర్త మృతదేహాన్ని కనుగొన్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement