సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోసం నేటినుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. బరిలో దిగే అభ్యర్థులకు జిల్లా కలెక్టర్, హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి కె. మాణిక్ రాజ్ కొన్ని సూచనలు చేశారు. అవి ఇలాఉన్నాయి..
♦ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే ముందు రోజు తన పేరిట బ్యాంక్ ఖాతాను తెరవాలి
♦ ఎన్నికల సమయంలో చేసే ఖర్చు మొత్తం బ్యాంక్ ఖాతా ద్వారానే చేయాలి
♦ నామినేషన్‌తో పాటు అభ్యర్థి మూడు నెలల లోపు తీసుకున్న తన ఫొటో కూడా జతచేయాలి
♦ నామినేషన్‌తోపాటు అఫిడవిట్‌ను కూడా పొందుపర్చాలి
♦ ఆఖరిరోజు సదరు అభ్యర్థి ప్రతిజ్ఞ చేయాలి
♦ నామినేషన్‌తో పాటు అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.25వేలు నగదు లేదా చలానా రూపేణా సమర్పించాలి
♦ అభ్యర్థి ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వారైతే రూ.12,500ను సెక్యూరిటీ డిపాజిట్ చేస్తూ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి
♦ హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలోనే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నామినేషన్లను ఈ నెల 18 నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. ఈ నెల 21, 23, 24వ తేదీల్లో సెలవుల కారణంగా నామినేషన్లు స్వీకరణ ఉండదు.
బ్యాంక్ ఖాతాతోనే ఖర్చులు చూపాలి
Published Mon, Mar 18 2019 9:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment