హుస్నాబాద్ (కరీంనగర్ జిల్లా) : భారీగా పేలుడు పదార్ధాలను తీసుకొని వెళ్తున్న మావోయిస్ట్ డిప్యూటీ దళ కమాండర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...చత్తీష్‌ఘడ్ రాష్ట్రం జగదల్‌పూర్ జిల్లాకు చెందిన ముసాకి అగ్మా మావోయిస్ట్ డిప్యూటీ దళ కమాండర్‌గా పని చేస్తున్నాడు.
అయితే అతను హుస్నాబాద్ మండలంలో జరగుతున్న కాలువ పనుల్లో కూలీగా పని చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న 37 జిలిటెన్ స్టిక్స్‌ను తస్కరించాడు. పేలుడు పదార్ధాలను బస్సులో తరలిస్తుండగా సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 37 జిలిటెన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకొని, మావోయిస్ట్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మావోయిస్ట్ డిప్యూటీ దళ కమాండర్ అరెస్ట్
Published Fri, Jul 3 2015 5:53 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement